మష్రూమ్ మంచూరియా |
|
కార్న్‌ఫ్లోర్ - 4 టేబుల్ స్పూన్లు
మైదా పిండి - 2 టేబుల్ స్పూన్లు
తాజా మష్రూమ్స్ - పావు కేజీ
అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను
సోయా సాస్ - అర టీ స్పూను
నూనె - తగినంత
ఉప్పు - తగినంత
వేయించడానికి:
అల్లం వెల్లుల్లి ముద్ద - టీ స్పూను
పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను
ఉల్లి తరుగు - పావు కప్పు
ఉల్లికాడల తరుగు - 2 టేబుల్ స్పూన్లు
నూనె - 2 టేబుల్ స్పూన్లు
సోయా సాస్ - ఒకటిన్నర టీ స్పూన్లు
చిల్లీ సాస్ - అర టేబుల్ స్పూను
టొమాటో కెచప్ - 2 టేబుల్ స్పూన్లు
మష్రూమ్‌లను మురికి పోయేలా శుభ్రంగా కడిగి, పొడి వస్త్రం మీద ఆరబెట్టి, తడి పోయాక ముక్కలుగా కట్ చేయాలి. (ముక్కల పరిమాణం మధ్యస్థంగా ఉండాలి) ఒక పెద్ద పాత్రలో మైదా పిండి, కార్న్‌ఫ్లోర్, అల్లం వెల్లుల్లి ముద్ద, అర టీ స్పూను సోయా సాస్, ఉప్పు , 4 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసి పకోడీల పిండి మాదిరిగా కలపాలి.మష్రూమ్ ముక్కలు జత చేసి కలపాలి
బాణలిలో నూనె కాగాక, కొద్దికొద్దిగా పిండి తీసుకుని పకోడీల మాదిరిగా వేయాలి. (కొద్దిగా బంగారు వర్ణంలోకి మారగానే తీసేయాలి. లేదంటే మాడిపోతాయి) .ఇలా అన్నీ తయారుచేసి, పక్కన ఉంచాలి .
వెడల్పాటి బాణలిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగాక, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి పెద్ద మంట మీద రెండు నిమిషాలు వేయించాలి. టొమాటో సాస్, సోయా సాస్, చిల్లీ సాస్, ఉప్పు, వే యించిన మంచూరియాలు వేసి బాగా కలిపి, ఉల్లికాడల తరుగు వేసి మరో మారు కలపాలి.
అన్నీ బాగా కలిసినట్లు అనిపించగానే మంట ఆర్పేసి, టొమాటో సాస్‌తో వేడివేడి మష్రూమ్‌లు అందించాలి.
No comments:
Post a Comment