అప్పడాల కూర |
|
మీకు అప్పడాలంటే ఇష్టం ఉంటే, ఈ కూరను కూడా ఇష్టపడతారు. ఈ కూర అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. రాజస్థానీయులు ఎక్కువగా తయారుచేసే ఈ కూరను చాలా త్వరగా తయారుచేసుకోవచ్చు.
కావలసినవి | పరిమాణం |
---|---|
అప్పడాలు | పావు కిలో |
నూనె | డీప్ ఫ్రైకి సరిపడా |
నెయ్యి లేదా సన్‌ఫ్లవర్ ఆయిల్ | 3 టేబుల్ స్పూన్లు |
జీలకర్ర | టీ స్పూను |
ఉల్లి తరుగు | పావు కప్పు |
అల్లం ముద్ద | టీ స్పూను |
వెల్లుల్లి ముద్ద | 2 టీ స్పూన్లు |
కారం | టీ స్పూను |
ధనియాల పొడి | 2 టీ స్పూన్లు |
పసుపు | అర టీ స్పూను |
అల్లం తురుము | టీ స్పూను |
ఇంగువ | పావు టీ స్పూను |
పచ్చి మిర్చి తరుగు | 2 టీ స్పూన్లు |
చిక్కగా గిలక్కొట్టిన పెరుగు | ఒకటిన్నర కప్పులు |
కొత్తిమీర తరుగు | 3 టేబుల్ స్పూన్లు |
ఉప్పు | తగినంత |
తయారీ:
- అప్పడాలను నూనెలో వేయించి నాలుగు ముక్కలుగా చేసి పక్కన ఉంచాలి (మైక్రోవేవ్‌లో కూడా చేసుకోవచ్చు).
- స్టౌ (సన్నని మంట) మీద బాణలి ఉంచి, నెయ్యి లేదా నూనె వేసి, కాగాక జీలకర్ర వేసి వేయించాలి.
- ఉల్లితరుగు వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాక, అల్లం వెల్లుల్లి ముద్ద, ఇంగువ, పచ్చి మిర్చి తరుగు వేసి బాగా కలపాలి .
- పెరుగు, కప్పుడు వేడి నీళ్లు జత చేయాలి .
- అప్పడం ముక్కలను వేసి జాగ్రత్తగా కలిపి, కొద్దిసేపు ఉడకనిచ్చి దింపే ముందు కొత్తిమీరతో అలంకరించి, అన్నంతో వడ్డించాలి..
No comments:
Post a Comment