VTStyles

Recent Post

Thursday, 19 February 2015

Sweets - Boorelu - Tips


  • గారెలూ, బూరెల్లాంటివి నూనెలో వేయించుకోవడం తప్పనిసరే కానీ, చిన్న మార్పులతో ఆ వినియోగాన్ని కొంతవరకూ తగ్గించుకోవచ్చు. మినపప్పు గారెలని కాకుండా సెనగపప్పుతో మసాలా గారెలు ప్రయత్నిస్తుంటే.. ఆ పిండిని కాస్త పల్చగా చేసుకుని పెనంమీద లేదా బాణలిలో వేసుకుని నూనెతో రెండువైపులా కాల్చుకోవచ్చు.

  • గారెలే చేయాలనుకుంటే.. నూనె ఎంపిక మొదలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. బజార్లో దొరికే ప్రతి నూనె వేపుళ్లకు పనికిరాదు. రైస్‌ బ్రాన్‌, సన్‌ఫ్లవర్‌, శాఫ్లవర్‌, పల్లీనూనెల్లాంటివి ఎంచుకోవాలి. లేదంటే నూనెలో రసాయనాలు విడుదలై.. పదార్థం కాలిన వాసన రావడమే కాదు, ఆరోగ్యానికీ మంచిది కాదు.

  • బాణలిలో నూనె వేశాక దాన్ని బాగా కాగనివ్వాలి. అప్పుడు గారె లేదా బూరె వేసినప్పుడు వెంటనే బయటి భాగం కాలి, దానిలోని నీరు బయటకు పోయి బుడగలు వస్తాయి. తరవాత అది వేగి, దానిచుట్టూ కరకరలాడే పొర ఏర్పడుతుంది. ఆ తరవాత మంట తగ్గిస్తే లోపలి భాగం కూడా పూర్తిగా కాలుతుంది. తక్కువ నూనెను పీల్చుకుంటాయి. అలా కాకుండా నూనె కాగకుండానే పిండిని వేస్తే.. నీరు నెమ్మదిగా బయటకు పోతుంది. దాంతో గాలి లోపలికి చేరి.. ఆ పదార్థం ఎక్కువ నూనె పీల్చుకునే అవకాశం ఉంటుంది. పదార్థం కూడా సాగినట్లు వస్తుంది. ఫలితంగా కెలొరీలు పెరిగిపోతాయి.

  • ఈ రోజుల్లో మెటల్‌ బాస్కెట్లు దొరుకుతున్నాయి. దాని అడుగున పల్చని జాలిలా ఉంటుంది. బాణలిలో నూనె వేశాక ఈ మెటల్‌ బాస్కెట్‌ను అందులో ఉంచాలి. ఈ బాస్కెట్‌లో గారె లేదా బూరె వేస్తే.. ఏదయినా పదార్థం చిట్లినా కూడా ఆ బాస్కెట్‌లోనే ఉంటుంది. ఈ బాస్కెట్లు ఒకటి నుంచి పది గారెలు వేయించుకునేందుకు వీలుగా అందుబాటులో ఉంటున్నాయి.

No comments:

Post a Comment