VTStyles

Recent Post

Wednesday, 15 July 2015

CommonMeal - Curry - Banana Stem Curry

అరటిదూట పెసరపప్పు చలవ కూర

అరటిదూట - ఒక ముక్క (మార్కెట్లో ముక్కలు అమ్ముతారు) పెసర పప్పు - పావు కప్పు పచ్చి మిర్చి - 6 కరివేపాకు - 2 రెమ్మలు ఆవాలు - టీ స్పూను జీలకర్ర - టీ స్పూను నూనె - టేబుల్ స్పూను ఉప్పు - తగినంత పసుపు - తగినంత

  • ముందుగా అరటిదూటను శుభ్రం చేయాలి  ఒక గిన్నెలో కొద్దిగా ఉప్పు, తగినన్ని నీళ్లు వేసి, అరటి దూటను సన్నగా తరగి ముక్కలను ఉప్పు నీళ్లలో వేయాలి. (లేదంటే నల్లబడిపోతాయి)  పెసరపప్పును సుమారు అర గంట సేపు నీళ్లలో నానబెట్టాలి 

  • బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి  పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు వేసి మరోమారు వేయించి ముందుగా అరటి దూట ముక్కలు వేసి బాగా కలపాలి  పెసరపప్పు కూడా వేసి బాగా కలిపి కొద్దిసేపు మూత ఉంచాలి. 

  • కొద్దిగా ఉడుకు పట్టాక ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి మరికాసేపు ఉంచి మెత్తగా ఉడికిన తర్వాత దించేయాలి 

  • ఇది ఒంటికి చలవ చేయడమే కాకుండా, మధుమేహ వ్యాధి ఉన్నవారికి ఔషధంగా పనిచేస్తుంది

No comments:

Post a Comment