పనస పొట్టు ఆవపెట్టిన కూర |
పనస పొట్టు - 2 కప్పులు అల్లం తురుము - టీ స్పూను కరివేపాకు - 3 రెమ్మలు పచ్చి మిర్చి - 8 చింతపండు గుజ్జు - 2 టీ స్పూన్లు (కొద్దిగా చింతపండును బాగా నానబెట్టి చిక్కగా గుజ్జు తీసి కొద్దిగా వేడి చేసి పక్కనుంచాలి)ఆవ కోసం... ఆవాలు - టీ స్పూను ఎండు మిర్చి - 2 (తగినన్ని నీళ్లు జత చేసి మెత్తగా నూరితే ఆవ సిద్ధమవుతుంది) పోపు కోసం... సెనగ పప్పు - అర టీ స్పూను మినప్పప్పు - అర టీ స్పూను ఆవాలు - పావు టీ స్పూను జీలకర్ర - అర టీ స్పూను ఉప్పు - తగినంత కారం - అర టీ స్పూను పసుపు - కొద్దిగా నూనె - 4 టీ స్పూన్లు; ఇంగువ - రెండు చిటికెలు
ముందుగా బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ వేసి కొద్దిగా వేయించిన తర్వాత సెనగ పప్పు, మినప్పప్పు వేసి వేయించాలి ఆవాలు, జీలకర్ర వేసి వేగాక, కరివేపాకు, పచి మిర్చి తరుగు, అల్లం తురుము వేసి బాగా వేయించాలి
పనసపొట్టు, పసుపు వేసి బాగా కలిపి పావు కప్పు నీళ్లు పోసి మూత ఉంచాలి కొద్దిగా ఉడికిన తరవాత మూత తీసేసి ఉడకనివ్వాలి
మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి ఉప్పు వేసి కలపాలి చింతపండు గుజ్జు, ఆవ వేసి బాగా కలిపి ఐదు నిమిషాలు ఉంచి దించేయాలి.
No comments:
Post a Comment