రాజ్మా మసాలా కర్రీ |
రాజ్మా - 2 కప్పులు ఉల్లిపాయ - 1 టమోటా -2 బిరియాని ఆకు - 1 దాల్చిన చెక్క - అంగుళం ముక్క లవంగాలు - 6 యాలకులు -3 అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను ధనియాల పొడి - 1 టీ స్పూను గరంమసాల - అర టీ స్పూను ఇంగువ - చిటికెడు పసుపు - పావు టీ స్పూను జీలకర్ర - అర టీ స్పూను ఉప్పు - రుచికి తగినంత నూనె - 1 టేబుల్ స్పూను కొత్తిమీర - అరకప్పు. టమేటో గుజ్జు - 1 కప్పు.
ఒక రాత్రి నానబెట్టిన రాజ్మా గింజల్ని సరిపడా నీటిలో 20 నిమిషాలు ఉడికించాలి.
కడాయిలో నూనె వేసి జీలకర్ర, బిరియాని ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వేగించాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లి తరుగు కూడా వేగాక టమోటా గుజ్జు, ఉడికించిన రాజ్మా వేసి, ఇంగువ, ఉప్పుతో పాటు రెండు కప్పుల వేడి నీటిని కలపాలి.
సన్నని మంటపై కూర చిక్కబడ్డాక కొత్తిమీర వేసి దించేయాలి.
ఈ కూర పరాటాలతో పాటు అన్నంలో కలుపుకున్నా బాగుంటుంది.
No comments:
Post a Comment