జిలేబీ |
మైదా పిండి - కప్పు బేకింగ్ పౌడర్ - అర టీ స్పూను పెరుగు - కప్పు నూనె - వేయించడానికి తగినంత పంచదార - కప్పు కుంకుమ పువ్వు - చిటికెడు ఏలకుల పొడి - పావు టీస్పూను మిఠాయి రంగు - రెండు చుక్కలు రోజ్ వాటర్ - 2 టేబుల్ స్పూన్లు
ఒక పాత్రలో మైదా పిండి, బేకింగ్ పౌడర్, పెరుగు వేసి బాగా కలిపి ఒక రోజంతా నాననివ్వాలి
మూతకు రంధ్రం ఉన్న మ్యాగీ సీసా వంటి దానిలో ఈ మిశ్రమాన్ని పోయాలి
ఒక పాత్రలో పంచదార, నీళ్లు, రోజ్ వాటర్ వేసి స్టౌ మీద ఉంచి పంచదార తీగ పాకం వచ్చేవరకు కలిపి దింపాక, ఏలకుల పొడి, కుంకుమ పువ్వు జత చేయాలి
బాణలిలో నూనె వేసి స్టౌ మీద ఉంచి వేడి చేయాలి (మంట మధ్యస్థంగా ఉండాలి)
పిండి ఉన్న సీసాను తీసుకుని జిలే బీ ఆకారం వచ్చేలా నూనెలో తిప్పాలి
బంగారు వర్ణంలోకి వచ్చేవరకు వేయించి వెంటనే పంచదార పాకంలో వేసి ఐదు నిమిషాలు ఉంచి తీసేయాలి
పిండి కలిపే విధానాన్ని బట్టే జిలేబీ వస్తుంది. కప్పు మైదా పిండికి రెండు చెంచాల సెనగపిండి లేదా మొక్కజొన్న పిండి కలపాలి. ఈ రెండూ అందుబాటులో లేకపోతే బియ్యప్పిండి వేసుకోవచ్చు. ఇవి లేకుంటే జిలేబీ కరకరలాడదు. రుచి కూడా రాదు.
అంతేకాదు పిండితయారీలో చిటికెడు వంటసోడా వేస్తేనే సరైన ఆకృతి వస్తుంది. పిండిని ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలపాలి. మరీ పల్చగానూ.. గట్టిగానూ కాకుండా దోశపిండిలా చేసుకోవాలి. పల్చగా అయితే వేయడం కష్టమవుతుంది. చిక్కగా అయితే జిలేబీలు వేశాక వాటిలోకి పాకం చేరదు. దాంతో చప్పగా ఉంటాయి.
ఇలా తడిపిన పిండి పదిహేను నుంచి ఇరవై గంటలు నానాలి. చలికాలంలో అయితే ఓ రోజంతా నానాల్సి ఉంటుంది. జిలేబీలు మంచి వాసన రావాలనుకుంటే పిండిలో రెండు చెంచాలు కరిగించిన నెయ్యి కలపాల్సి ఉంటుంది.
నానబెట్టాక కాస్త పల్చగా అయ్యిందనిపిస్తే.. వేసేముందు రెండు చెంచాల పొడి పిండి కలుపుకోవాలి. వీటిని వేయించడానికి వెడల్పాటి పాన్‌ని ఎంచుకోవాలి. అలాగే మొత్తం నూనె కాకుండా సగం నెయ్యి వేస్తే రుచిగా వస్తాయి.
ఇలా వేయించుకున్న జిలేబీలను గోరువెచ్చగా ఉండే పాకంలో ఒక్కొక్కటే వేయాలి. వేశాక అవి మూడు నుంచి నాలుగు నిమిషాలు పాకంలో ఉంటే సరిపోతుంది. లేదంటే ఒకదానికి మరొకటి అతుక్కుపోతాయి. చక్కెర పాకం కూడా తీగపాకం రానివ్వాలి. ఆ తరవాత చెంచా నిమ్మరసం కలిపి దింపేయాలి.
ఒకవేళ జిలేబీని అప్పటికప్పుడు చేయాలంటే.. పిండి తయారీలో వంటసోడాకు బదులు యీస్ట్, ముప్పావుకప్పు పెరుగు వాడాలి. మజ్జిగైతే అరకప్పు సరిపోతుంది.
No comments:
Post a Comment