గోధుమ మోమో |
గోధుమ పిండి- అరకప్పు మొక్కజొన్న పిండి- పావుకప్పు నూనె- ఒక టేబుల్‌స్పూను సోయా సాస్ ఉప్పు- ఒక్కో టీస్పూను చొప్పున క్యాబేజీ(తరిగి)- పావుకేజి పుట్టగొడుగులు(తరిగి)- ఎనిమిది ఉల్లిపాయ(తరిగి) క్యాప్సికమ్(తరిగి)- ఒక్కోటి చొప్పున వెనిగర్ వెల్లుల్లి పేస్టు- అరటీస్పూను చొప్పున.
ఒక గిన్నెలో గోధుమపిండి, మొక్కజొన్న పిండి, కొద్దిగా నూనె, ఉప్పు వేసి నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పావుగంటపాటు నానబెట్టాలి.
ఒక పాన్‌లో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయలు, వెల్లుల్లి పేస్టు వేగించాలి. ఉల్లిపాయలు వేగాక కూరగాయ ముక్కలన్నీ వేసి వేగించాలి. అవి ఉడికిన తరువాత ఉప్పు, సోయాసాస్ వేసి ఒక నిమిషంపాటు వేగించి స్టవ్ ఆపేయాలి.
కలిపి ఉంచిన పిండితో చిన్న చిన్న చపాతీలు చేసి వాటిల్లో ఒక్కో టేబుల్‌స్పూను చొప్పున కూరగాయల మిశ్రమం పెట్టాలి. ఈ మిశ్రమం బయటకు పోకుండా చపాతీని మూసేయాలి.
గిన్నెలో లేదా స్టీమర్‌లో నీళ్లు పోసి మరిగించాలి. ఆ ఆవిరిలో ఈ మోమోలను ఉడికించాలి. స్టీమర్ లేకపోతే ఇడ్లీ పాత్రలోనైనా వీటిని చేసుకోవచ్చు. ఈ గోధుమ మోమోలను వేడివేడిగా చిల్లీ సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి.
No comments:
Post a Comment