మధుర వడలు |
సెనగపప్పు- 1 కప్పు, పెసరపప్పు-1 కప్పు, ఎర్రపప్పు- 1 కప్పు, మినప పప్పు- 1 కప్పు, రాజ్‌మా- 1 కప్పు, సోయాబీన్స్- 1 కప్పు, ఉల్లి తరుగు- 1 కప్పు, కొత్తిమీర, పుదీన, కరివేపాకు, ఉల్లికాడలు- 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్- 1 , ఉప్పు, కారం- తగినంత, జీలకర్ర- 1 , పసుపు- ఒక , పచ్చిమిర్చి పేస్ట్- 1
సెనగపప్పు, పెసరపప్పు, మినపపప్పు, సోయాబీన్స్, రాజ్‌మాలను నాలుగు గంటలపాటు నీటిలో నానబెట్టాలి.
తర్వాత మిక్సీలో వేసి కొంచెం గరకగా రుబ్బాలి. ఇప్పుడు ఈ పిండిలో ఉల్లి తరుగు, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, కొత్తిమీర, పుదీన, కరివేపాకు, అల్లంవెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ వేసి కలుపుకోవాలి.
బాణలిలో నూనెపోసి కాగిన తర్వాత పిండితో వడలను చేసి కాల్చుకోవాలి.
No comments:
Post a Comment