మలై చమ్ చమ్ |
పనీర్- రెండు కప్పులు చక్కెర- నాలుగు కప్పులు నీళ్లు- ఐదు కప్పులు పాలు- మూడు కప్పులు యాలకల పొడి- ఒక టీస్పూను బాదం జీడిపప్పు పలుకులు- నాలుగు టీస్పూన్లు. కుంకుమ పువ్వు- అరటీస్పూను.
పనీర్‌ని గిన్నెలో వేసి మెత్తగా అయ్యేవరకు కలిపి చిన్న చిన్న ఉండలు కొంచెం పొడవుగా చేయాలి.
గిన్నెలో నీళ్లు మరిగించి చక్కెర, చిటికెడు కుంకుమపువ్వు వేసి కలపాలి. చక్కెర కరిగి పాకం అయ్యాక పనీర్ ఉండల్ని వేయాలి.
సన్నటి మంటపై పావుగంట ఉడకనివ్వాలి. పనీర్ ఉండలు మెత్తగా స్పాంజిలాగ అయ్యాక స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి.
మరొక గిన్నెలో పాలు కోవాలాగ అయ్యేవరకు మరిగించి చక్కెర వేయాలి. అది కరిగాక స్టవ్ ఆపేయాలి. పనీర్ ఉండల్ని మధ్యకు కట్‌చేసి ఈ కోవా దానిలో స్టఫింగ్ చేస్తే మలై చమ్ చమ్ రెడీ...
No comments:
Post a Comment