VTStyles

Recent Post

Thursday, 28 July 2016

Sweets - Burfi - Bottlegourd Burfi / అనప బర్ఫీ

అనప బర్ఫీ


సొరకాయ తురుము- 1/2 కేజీ నెయ్యి- 1 టేబుల్‌ స్పూను పంచదార- 3/4 కప్పు యాలకుల పొడి- 1/4 టీ స్పూను బాదం తురుము- 4 టీ స్పూన్లు పచ్చి కోవా/పనీర్‌/కాటేజ్‌ చీజ్‌- 1/4 కేజీ

  • బాణలిలో నెయ్యి వేడి చేసి సొరకాయ తురుమును వేసి వేగించాలి. పదార్థం నుంచి నీరు విడుదలవుతుండగా పంచదార వేసి బాగా కలపాలి.

  • మంట మధ్యస్థంగా ఉంచి నీరంతా ఆవిరి అయ్యే వరకూ కలుపుతూ వేగించాలి. తరువాత పనీర్‌/ కోవా/ కాటేజ్‌ చీజ్‌ల్లో ఏదో ఒక దానిని వేసి కావాలనుకుంటే గ్రీన ఫుడ్‌ కలర్‌ కూడా వేసుకుని బాగా కలిపి మరో ఐదు నిమిషాలు కలుపుతూ ఉడికించాలి.

  • ఆ తరువాత యాలకుల పొడి, బాదం తురుము వేసి కలిపి పదార్థాన్నంతా నెయ్యి రాసిన పళ్ళెంలో సమానంగా పరచి ఆరిన తరువాత ముక్కలు కోయాలి.

No comments:

Post a Comment