VTStyles

Recent Post

Tuesday, 2 August 2016

Breakfast - Steamed - Chicken Potli / చికెన్ పొట్లి

చికెన్ పొట్లి


బోన్‌లెస్ చికెన్- 250 గ్రా (ఉడికించి గ్రైండ్‌చేయాలి) బీన్స తరుగు క్యారెట్‌ తరుగు ఉల్లికాడల తరుగు - 3 టీ స్పూన్ల చొప్పున టొమాటో - 1(తరగాలి) సోయాసాస్‌ - 2 టీ స్పూన్లు కారం - 2 టీ స్పూన్లు ఉప్పు - తగినంత నల్ల మిరియాలు - 5 మైదా - 3 టేబుల్‌ స్పూన్లు పాలు - కప్పు నిమ్మరసం - టీ స్పూన్.

  • మైదాను పాలతో చపాతీ పిండిలా కలిపి పక్కనుంచాలి. పానలో నూనె వేడయ్యాక క్యారెట్‌, బీన్స, ఉల్లికాడల తరుగు వేసి వేయించాలి.

  • తర్వాత అందులో చికెన్, టొమాటో, సోయాసాస్‌, ఉప్పు, మిరియాలు కలిపి కొద్దిగా వేగనివ్వాలి. మైదాపిండిని చిన్న పూరీలా చేసుకుని అందులో చికెన్ మిశ్రమాన్ని కొద్దిగా పెట్టి, ఉల్లికాడలతో మూటలా కట్టి పొట్లీని తయారుచేయాలి.

  • ఇలా తయారుచేసుకున్న పొట్లీలను ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడికించాలి. వీటిని సాస్‌తో వేడివేడిగా తింటే రుచిగా ఉంటాయి.

No comments:

Post a Comment