VTStyles

Recent Post

Showing posts with label Snacks_Mixture. Show all posts
Showing posts with label Snacks_Mixture. Show all posts

Wednesday, 14 September 2016

Snacks - Mixture - Popcorn Mixture / పాప్‌కార్న్‌ మిక్స్చర్‌

పాప్‌కార్న్‌ మిక్స్చర్‌


పాప్‌కార్న్‌- రెండు కప్పులు బియ్యప్పిండి- ఒక కప్పు పల్లీలు- ఒక కప్పు జీడిపప్పు బాదం కలిసి- అర కప్పు నూనె- రెండు కప్పులు కారం- రెండు టీ స్పూన్లు ఉప్పు- తగినంత నెయ్యి- రెండు టీ స్పూన్లు జెమ్స్‌- అర కప్పు నీరు- తగినంత.

  • బియ్యంపిండిలో ఉప్పు, కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి, గట్టిగా కలుపుకోవాలి. ఒక బాణలిలో నూనె పోసి, వేడెక్కాక కలిపిపెట్టిన బియ్యంపిండితో సన్నటి మురుకులు వేసుకోవాలి.

  • మురుకులు తీసిన తర్వాత పల్లీలు, బాదం, జీడిపప్పు కూడా అదే నూనెలో వేగించాలి. తర్వాత నెయ్యిని కరిగించి పాప్‌కార్న్‌పై వేసి బాగా కలపాలి.

  • దీంట్లో వేగించిన పల్లీలు, బాదం, జీడిపప్పు వేసి కలపాలి. చివర్లో మురుకులను కూడా చేత్తో నలిపి ముక్కలు చేసి ఈ మిశ్రమానికి జతచేయాలి

  • చివర్లో జెమ్స్‌ కూడా వేయాలి. ఈ పాప్‌కార్న్‌ మిక్స్చర్‌ స్వీటు, హాట్‌ కలగలిపిన రుచితో కొత్తగా ఉంటుంది.

Snacks - Mixture - Tandoori Popcorn / తందూరి పాప్‌‌కార్న్

తందూరి పాప్‌‌కార్న్


పాప్‌కార్న్‌- రెండు కప్పులు నెయ్యి లేదా వెన్న- రెండు టేబుల్‌ స్పూన్లు యాలకుల పొడి- చిటికెడు జీలకర్ర- అర టీ స్పూను దనియాలు- పావు టీ స్పూను సొంటి పొడి- పావు టీ స్పూను కారం- పావు టీ స్పూను ఉప్పు- చిటికెడు పసుపు- చిటికెడు.

  • నెయ్యి లేదా వెన్నని వేడిచేసి పాప్‌కార్న్‌పై వేసి బాగా కలపాలి. మిగిలిన పదార్థాలన్నిటినీ ఒక చిన్న గిన్నెలో కలిపి పెట్టుకొని, పాప్‌కార్న్‌పై కొద్ది కొద్దిగా చల్లుతూ బాగా కలపాలి.