![]() |
మరి కొన్ని ఆవడ రుచులు |
కావలసిన పదార్థాలు
*మొక్కజొన్న గింజలు- ఒకటిన్నర కప్పు
* బియ్యప్పిండి- 1 టీ స్పూను
* పెరుగు- 2 కప్పులు
* పచ్చి మిర్చి తరుగు- 2 టీ స్పూన్లు
* అల్లం తరుగు- 1 టీ స్పూను
* ఉల్లిపాయ- 1
* తాలింపు దినుసులు- 1 టీ స్పూను
* కరివేపాకు- 1 రెబ్బ
* కొత్తిమీర తరుగు- 1 టీ స్పూను
* ఉప్పు- రుచికి సరిపడా
* కారం- 1/4 టీ స్పూను
* నూనె- వేగించడానికి సరిపడా..
తయారుచేయు విధానం
ముందుగా పెరుగులో అర టీ స్పూను అల్లం, కొత్తిమీర, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, ఒక టీ స్పూను పచ్చిమిర్చి తరుగు, కారం వేసి బాగా కలపి పక్కన పెట్టాలి.
తరువాత మొక్కజొన్న గింజలు, స్పూను పచ్చిమిర్చి తరుగు, అర స్పూను అల్లం తరుగు, ఉప్పు కలిపి మెత్తగా గారెల పిండి రుబ్బుకోవాలి.
ఆ తరువాత ఒక కడాయిలో నూనె వేడిచేసి గారెలు వేసుకుని రెండు వైపులా దోరగా వేగించాక తీసి పెరుగు మిశ్రమంలో వేసుకోవాలి.
No comments:
Post a Comment