![]() |
మరి కొన్ని వడ రుచులు |
మరి కొన్ని స్నాక్ వడ రుచులు |
సలహాలు & సూచనలు |
కావలసిన పదార్థాలు
* పచ్చిశెనగపప్పు- 1 కప్పు
* పనసగింజలు- 20
* ఉల్లిపాయ- 1
* పచ్చిమిర్చి- 2
* ఎండుమిర్చి- 2
* జీలకర్ర- 1/4 టీ స్పూను
* అల్లం తురుము- 1/2 టీ స్పూను
* కరివేపాకు- ఒక రెబ్బ
* ఉప్పు- రుచికి సరిపడా
* నూనె- డీప్ ఫ్రైకి సరిపడా.
తయారుచేయు విధానం
ముందుగా శెనగపప్పును ఒక గంటసేపు నానబెట్టాలి. తరువాత పనసగింజలపై ఉండే తెల్లని పొట్టు తీసేసి, ఆ గింజలను సగానికి కోయాలి. తరువాత వాటిని కుక్కర్‌లో వేసి అర కప్పు నీళ్ళు పోసి మూడు విజిల్స్ వచ్చేవరకూ ఉడికించి దింపాలి.
గింజలు చల్లారాక మిక్సీలో వేసి నీళ్ళు పోయకుండా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తరువాత శెనగపప్పు, ఎండుమిర్చిలను కూడా మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి.
ఆ తరువాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకులను చిన్న ముక్కలుగా కోసి వాటన్నిటినీ ఒక గిన్నెలో వేసి, అల్లం తురుము, జీలకర్ర, పనస గింజల పేస్ట్, శెనగపప్పు పేస్ట్, ఉప్పు కూడా వేసి బాగా కలపాలి. తరువాత నూనె వేడిచేసి చిన్న చిన్న వడలు వేసి దోరగా వేగించాలి.
No comments:
Post a Comment