![]() |
మరి కొన్ని బజ్జీలు రుచులు |
సలహాలు & సూచనలు |
కావలసిన పదార్థాలు
* మైదా ఒక క ప్పు
* నూనె మూడు టేబుల్ స్పూన్లు
* ఉప్పు తగినంత.
పుదీనా పచ్చడి పావుక ప్పు
* శెనగపిండి ఐదు టేబుల్ స్పూన్లు
* నూనె రెండు టేబుల్ స్పూన్లు
* కారం అర టీ స్పూను
* వాము ఒక టీ స్పూను
* గరంమసాలా అర టీస్పూను
* టమోటా సాస్ ఐదు టీ స్పూన్లు
* ఉప్పు నూనె తగినంత.
తయారుచేయు విధానం
మైదా, ఉప్పు కలిపి జల్లెడపట్టి దానిలో నూనెవేయండి. కొంచెం నీళ్ళు కూడా వాడి మెత్తటి ముద్దలా చేసి పక్కన పెట్టుకోండి.
మూకుట్లో కొంచెం నూనెవేసి, శెనగపిండి వేసి బంగారురంగు వచ్చేదాకా వేగించండి. దించాక ఉప్పు, అన్ని మసాలా పొడులు, టమోటా సాస్ కలపండి.
ఇప్పుడు మైదా ముద్దలో నుంచి నిమ్మకాయంత ఉండ తీసుకుని పావు అంగుళం మందం చపాతీ చేయండి. దానిలో మూడో వంతు భాగానికి పుదీనా చట్నీ పూయండి. మధ్యభాగం వదిలేసి మిగతా భాగానికి శెనగపిండి మిశ్రమాన్ని పూయండి. స్విస్ రోల్స్‌కి మడిచినట్టుగా మడిచి ఫ్రిజ్‌లో అరగంట ఉంచండి.
తర్వాత పావు లేదా అర అంగుళం మందం స్లయిస్‌లలా కట్‌చేసి అరచేతిలో పెట్టుకుని అదమండి. మూకుడు పెట్టి నూనెలో బజ్జీల్లా వేగించండి. లేదా ఓవెన్‌లో కూడా బ్రేక్ చేయొచ్చు.
పని కాస్త ఎక్కువే అయినా తినడానికి, చూడడానికి బాగుంటాయి. కొన్ని రోజులపాటు నిల్వ కూడా ఉంటాయి.
No comments:
Post a Comment