![]() |
మరి కొన్ని ఉప్మా రుచులు |
కావలసిన పదార్థాలు
* చికెన్ - 500గ్రా(5 నుంచి 6 ముక్కలు)
* పెరుగు - పావుకప్పు
* కారం - పావు టీస్పూన్
* నీళ్లు - ఒకకప్పు
* ఉప్పు - తగినంత
* మైదా - ఒక కప్పు
* బ్రెడ్ పొడి - కొద్దిగా
* కోడిగుడ్డు - ఒకటి
* నూనె - డీప్ ఫ్రైకోసం సరిపడా
* బర్గర్ బన్నులు - ఆరు
* టొమాటో (ముక్కలు) - మూడు.
తయారుచేయు విధానం
చికెన్ ముక్కలను మజ్జిగలో వేసి నాలుగు గంటలు పక్కన పెట్టాలి.
పెరుగు, ఉప్పు, కారాలను ఒక కప్పులో తీసుకుని నీళ్లు పోసి కలపాలి. కొంచెం ఉప్పు, కారం తీసుకుని మైదాలో వేసి కలపాలి. ఒక చిన్న పాత్రలో కోడిగుడ్డును పగలకొట్టి రెండు టేబుల్‌స్పూన్ల నీళ్లు కలపాలి.
చికెన్ నానబెట్టిన మజ్జిగను వంపేసి ఒక్కో చికెన్ ముక్కను పిండి మిశ్రమంలో అద్దాలి. తరువాత కోడిగుడ్డు సొనలో ముంచి తరువాత బ్రెడ్ పొడిలో దొర్లించాలి. పది నిమిషాల పాటు పక్కనపెట్టాలి.
నూనె వేడెక్కాక చికెన్ ముక్కలను డీప్ ఫ్రై చేయాలి. బన్‌ను రెండు ముక్కలుగా కోసి మధ్యలో ఫ్రై చేసిన చికెన్ మిశ్రమాన్ని, టొమాటో ముక్కలు పెట్టాలి. దీన్ని వేడివేడిగా తింటే టేస్టీగా ఉంటుంది.
No comments:
Post a Comment