![]() |
మరి కొన్ని రుచులు |
కావలసిన పదార్థాలు
* మైదా - ముప్పావు కప్పు
* చక్కెర - రెండు చెంచాలు
* గుడ్డు - ఒకటి
* ఉప్పు కలపని వెన్న - పావు కప్పు
* తాజా ఈస్ట్ - చెంచా
* బేకింగ్ పౌడర్ - అరచెంచా
* పాలు - పావుకప్పు
* ఉప్పు - చిటికెడు
* వెనిల్లా ఎసెన్స్ - అరచెంచా. గ్లేజింగ్ కోసం కావల్సినవి: చక్కెర - పావుకప్పు
* పాలు - రెండు టేబుల్ స్పూన్లు
* వెనిల్లా ఎసెన్స్ - పావుచెంచా
* చాక్లెట్- పావుకప్పు
* క్రీం - కొద్దిగా.
తయారుచేయు విధానం
మైదాను జల్లించి ఉప్పూ, చక్కెరా, బేకింగ్ పౌడర్, ఈస్ట్ వేసి బాగా కలపాలి. తరవాత పాలూ, గుడ్డూ వేయాలి. ఇది మరీ మెత్తగా, అలాగని గట్టిగా కాకుండా కలుపుకోవాలి.
ఇందులో కరిగించిన వెన్న వేసి కలపాలి. తడి వస్త్రం కప్పి అరగంటసేపు నాననివ్వాలి. తరవాత మరోసారి కలిపి కాస్త మందంగా చపాతీలా వత్తాలి.
ఈ చపాతీని అర్ధచంద్రాకారంలో బిళ్లల్లా కోసుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని 180 డిగ్రీల ఉష్ణోగ్రత పదిహేను నిమిషాలు బేక్ చేసుకుని తీసుకోవాలి.
ఇప్పుడు చాక్లెట్ తప్ప గ్లేజింగ్ కోసం తీసుకున్న పదార్థాలన్నింటినీ పొయ్యిమీద పెట్టాలి. ఇది మిశ్రమంలా అయ్యాక దింపేస్తే చాలు. ఒక్కో డోనట్‌పై ఈ క్రీం, కరిగించిన చాక్లెట్ వేసుకుంటూ వస్తే చాలు.
No comments:
Post a Comment