![]() |
మరి కొన్ని రుచులు |
కావలసిన పదార్థాలు
*మైదా - ఒకటిన్నర కప్పు
* చక్కెర - పావుకప్పు
* గుడ్డు - ఒకటి
* ఉప్పు కలపని వెన్న - రెండు చెంచాలు
* తాజా ఈస్ట్ - చెంచా
* ఉప్పు - చిటికెడు
* పాలు - అరకప్పు
* దాల్చిన చెక్క పొడి - ఒకటిన్నర చెంచా
* నూనె - వేయించేందుకు సరిపడా
* బేకింగ్‌పొడి - రెండు చెంచాలు.
క్రీం కోసం
* చక్కెర - రెండు టేబుల్‌స్పూన్లు
* వెనిల్లా ఎసెన్స్ - అరచెంచా
* పాలు - రెండు టేబుల్‌స్పూన్లు
* నూనె - వేయించేందుకు సరిపడా.
తయారుచేయు విధానం
మైదాను జల్లించి, అందులో ఉప్పు, చక్కెరా, బేకింగ్‌పొడి, ఈస్ట్ వేసుకుని బాగా కలపాలి. తరవాత పాలూ, గుడ్డు సొనా వేసి పిండిలా కలపాలి.
ఇందులో వెన్న కలిపి పైన తడి వస్త్రాన్ని కప్పి అరగంటసేపు నాననివ్వాలి. ఇలా చేయడం వల్ల పిండి పొంగుతుంది.
అప్పుడు మరోసారి కలిపి కాస్త మందంగా చపాతీలా వత్తాలి. ఈ పిండిని గుండ్రంగా రోల్‌లా చుట్టుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని కాగుతోన్న నూనెలో వేసి వేయించుకుని తీసుకోవాలి.
ఇప్పుడు క్రీం కోసం తీసుకున్న పదార్థాలన్నింటినీ పొయ్యిమీద పెట్టాలి. ఇది చిక్కగా అయ్యాక దింపేస్తే చాలు. తరవాత ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న డోనట్లు ముంచి తరవాత దాల్చిన చెక్కపొడి చల్లితే చాలు.
No comments:
Post a Comment