![]() |
మరి కొన్ని రుచులు |
* డోనట్స్ కోసం: మైదా - కప్పు
* చక్కెర - రెండు చెంచాలు
* ఉప్పు కలపని వెన్న - కొద్దిగా
* తాజా ఈస్ట్ - రెండు చెంచాలు
* గుడ్డు - ఒకటి
* పాలు - పావు కప్పు
* ఉప్పు - చిటికెడు
* నూనె - వేయించేందుకు సరిపడా.
క్రీం కోసం
* ఉప్పు కలపని వెన్న - రెండు చెంచాలు
* తాజా ఈస్ట్ - చెంచా
* నీళ్లు - రెండు టేబుల్ స్పూన్లు
* పాలపొడి - చెంచా
* ఉప్పు - చిటికెడు
* స్ట్రాబెర్రీ గుజ్జు - పావుకప్పు (బజార్లో దొరుకుతుంది).
తయారుచేయు విధానం
ముందుగా డోనట్స్ తయారుచేసుకోవాలి. మైదాను జల్లించి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. అందులో ఉప్పూ, పాలూ, చక్కెరా, ఈస్ట్ వేయాలి.
తరవాత గుడ్డు పచ్చసొన వేసి పిండి మరీ పల్చగా, అలాగని గట్టిగా కాకుండా కలుపుకోవాలి. వెన్న వేసి కలిపి దానిపై తడి వస్త్రాన్ని కలిపి అరగంటసేపు నాననివ్వాలి. ఇలా చేయడం వల్ల పిండి పొంగుతుంది.
తరవాత దాన్ని కాస్త మందంగా చపాతీలా వత్తి, గుండ్రటి మౌల్డుతో నొక్కాలి. ఇలా చేసుకున్న వాటిని కాగుతోన్న నూనెలో వేసి వేయించుకుని తీసుకోవాలి. వీటి మధ్యలో అడ్డంగా చిన్న గాటులా పెట్టుకోవాలి.
ఇప్పుడు క్రీం తయారు చేసుకోవాలి. ఈ పదార్థాలన్నింటినీ తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. ఇది చిక్కగా అయ్యాక దింపేయాలి. ఇప్పుడు ఆ క్రీంను మధ్యలో గాటుపెట్టిన చోట అద్దితే సరిపోతుంది.
No comments:
Post a Comment