![]() |
మరి కొన్ని ప్యాన్ కేకు రుచులు |
కావలసిన పదార్థాలు
*బ్రెడ్ ముక్కలు- ఎనిమిది
* అరటిపండ్లు- రెండు
* మైదాపిండి- ఒక కప్పు
* వెనీల- రెండు టీస్పూన్లు
* చక్కెర- రెండు టేబుల్‌స్పూన్లు
* పాలు- అరకప్పు
* వెన్న- ఒక టేబుల్‌స్పూను
తయారుచేయు విధానం
ఒక గిన్నెలో మైదా పిండి, అరటిపండు, కొద్దిగా పంచదార, వెనీలా వేసి మెత్తగా అయ్యే దాకా కలపాలి. దీనిలో తగినన్ని పాలు పోసి దోశెలపిండిలాగ కలుపుకోవాలి.
స్టవ్‌పై పాన్ పెట్టి వెన్న వేడి చేయాలి. బ్రెడ్ ముక్కల్ని పిండిలో ముంచి పాన్‌పై కాల్చాలి. ఇలా రెండు వైపులా లేత గోధుమరంగు వచ్చే వరకు చేయాలి.
వీటిపై పంచదార పొడి చల్లుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి.
No comments:
Post a Comment