![]() గ్రిల్డ్ పొటాటో |
మరి కొన్ని శాండ్విచ్ రుచులు |
కావలసిన పదార్థాలు
* బంగాళాదుంపలు - 3 (ఉడకబెట్టి
* తోలు తీసి మ్యాష్ చేసి పెట్టుకోవాలి)
* కొత్తిమీర తరుగు - 2 టే.స్పూన్లు
* సన్నగా తరిగిన అల్లం - 1 టీస్పూను
* సన్నగా తరిగిన పచ్చిమిర్చి - 1 టే.స్పూను
* జీలకర్ర - అర టీస్పూను
* ఉప్పు - అర టీస్పూను
* ఆమ్‌చూర్ - అర టీస్పూను
* కరిగించిన బటర్ - 2 టే.స్పూన్లు
* చీజ్ - 2 స్లయిసెస్
* టమేటా స్లయిసెస్ - 8.
తయారుచేయు విధానం
గిన్నెలో బంగాళాదుంప, కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర, ఆమ్‌చూర్ వేసి కలుపుకోవాలి. బ్రెడ్ స్లయిసెస్‌కు ఓవైపు బటర్ పూసి ఈ మిశ్రమాన్ని పల్చగా పరచాలి. తర్వాత మిశ్రమం పైన బటర్ పూసి పెట్టుకోవాలి.
ఇలా అన్ని స్లయిసెస్ తయారుచేసుకోవాలి. స్కిలెట్ మీడియం హీట్ మీద వేడిచేసి శాండ్‌విచ్‌లను బంగాళాదుంప మిశ్రమం ఉన్నవైపు బోర్లించి 2-3 నిమిషాలు కాల్చుకోవాలి. అంతకంటే తక్కువ సమయంలో స్లయి్‌సను తిరగేస్తే మిశ్రమం బ్రెడ్‌కు అంటుకోకుండా ఊడి వచ్చేస్తుంది.
మిశ్రమం ఉన్న వైపు కాల్చుకున్న తర్వాత తిరగేసి ఒక చీజ్ స్లయిస్ ఉంచి దాని మీద బ్రెడ్ స్లయిస్ కనిపించనంతగా టమాటో స్లయిసెస్ పరచాలి. తర్వాత ఇలాగే కాల్చుకున్న మరో స్లయి్‌సను (మిశ్రమం ఉన్న వైపు) టమాటో స్లయిసెస్ మీద బోర్లించి చీజ్ కరిగేవరకూ రెండువైపులా కాల్చుకోవాలి. తర్వాత క్రాస్‌గా కట్ చేసి కొత్తిమీర చట్నీతో సర్వ్ చేయాలి.
No comments:
Post a Comment