![]() సగ్గు బియ్యం చెక్కలు |
మరి కొన్ని నిప్పట్టు రుచులు |
సలహాలు & సూచనలు |
కావలసిన పదార్థాలు
*బియ్యం - మూడుకప్పులు
* పెసరపప్పు - కప్పు
* సగ్గుబియ్యం - అరకప్పు
* నువ్వులు - రెండు టేబుల్‌స్పూన్లు
* జీలకర్ర - చెంచా
* వెన్న - చెంచా
* కారం
* ఉప్పు -రుచికి తగినంత
* నూనె - వేయించడానికి సరిపడా.
తయారుచేయు విధానం
బియ్యం, పెసరపప్పూ, సగ్గుబియ్యాన్ని కలిపి మెత్తగా పిండిలా చేసుకోవాలి. అందులో నువ్వులూ, జీలకర్రా, తగినంత ఉప్పూ కారం, వెన్న వేసుకుని బాగా కలపాలి.
తరవాత సరిపడా నీళ్లు పోసుకుంటూ చపాతీముద్దలా కలపాలి. ఐదు నిమిషాల తరవాత ఈ పిండిని చిన్నచిన్న చెక్కల్లా అద్దుకుని వేడినూనెలో వేయించుకోవాలి. బాగా వేగాక తీసేస్తే సరిపోతుంది.
No comments:
Post a Comment