
స్వీట్ క్రీం టీ
మరి కొన్ని డ్రింక్స్ రుచులు |
సలహాలు & సూచనలు |
కావలసిన పదార్థాలు
*టీ బ్యాగులు - మూడు
* చక్కెర - కప్పు
* చిక్కని క్రీం - కప్పు
* నీళ్లు - రెండు కప్పులు.
తయారుచేయు విధానం
ఓ గిన్నెలో నీటిని తీసుకుని పొయ్యిమీద పెట్టి మరిగించాలి. అందులో టీ బ్యాగులు వేసి మూతపెట్టి, పొయ్యికట్టేయాలి.
పదినిమిషాల తరవాత టీ బ్యాగుల్ని తీసేసి చక్కెరవేసి బాగా కలపాలి. ఈ టీని మరోసారి సన్ననిమంటపై పెట్టాలి. ఇది తేనె రంగులోకి మారాక క్రీం వేసుకోవాలి.
మంట తగ్గించి మధ్యమధ్య కలుపుతూ ఉంటే కాసేపటికి ఇది చిక్కని టీలా తయారవుతుంది. అప్పుడు దింపేసి చల్లారనివ్వాలి. తరవాత ఓ రోజంతా ఫ్రిజ్‌లో ఉంచి మర్నాడు తీసుకోవాలి. అంతే స్వీట్ క్రీం టీ సిద్ధం.
No comments:
Post a Comment