VTStyles

Recent Post

Saturday, 9 July 2016

Continental - Rolls - Bread Roll / బ్రెడ్‌రోల్‌

బ్రెడ్‌రోల్‌


బ్రెడ్‌స్లైసులు - పది ఆలూ ముక్కలు - ఒకటిన్నర కప్పులు క్యారెట్‌ ముక్కలు నానబెట్టిన బఠాణీలు - అరకప్పు కారం - అరచెంచా గరంమసాలా - అరచెంచా పసుపు - చిటికెడు ఆమ్‌చూర్‌ పొడి - అరచెంచా కొత్తిమీర తరుగు - రెండు చెంచాలు ఉప్పు - తగినంత నూనె - వేయించేందుకు సరిపడా మైదా - చెంచా.

  • ఆలూ ముక్కలను ఉడికించుకుని తీసుకోవాలి. అదేవిధంగా క్యారెట్‌, బఠాణీలూ ఉడికించుకోవాలి. అలాగని మరీ మెత్తగా చేసుకోకూడదు. ఈ మూడింటినీ ఓ గిన్నెలోకి తీసుకుని చక్కగా కలిపి ముద్ద చేసుకోవాలి.

  • అందులో కారం, గరంమసాలా, పసుపూ, తగినంత ఉప్పూ, కొత్తిమీర తరుగూ, ఆమ్‌చూర్‌ పొడీ వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పది భాగాలుగా చేసుకోవాలి.

  • బ్రెడ్‌ స్లైసుల అంచులు కత్తిరించుకోవాలి. వీటిని పెనంమీద ఉంచి ఓ నిమిషం కాల్చుకుని తీసుకోవాలి. తరవాత అప్పడాల కర్రతో ఇంకాస్త వెడల్పుగా చేసుకోవాలి.

  • మైదాలో నీళ్లు పోసి ముద్దలా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఓ స్లైసుపై ముందుగా చేసుకున్న కూర ఉంచి బ్రెడ్‌ను మధ్యకు మడవాలి. మైదా మిశ్రమంతో అంచులు మూసేయాలి.

  • ఇలా మిగిలిననవీ చేసుకోవాలి. వీటిని కాగుతోన్న నూనెలో వేయించుకుని తీసుకోవాలి.

No comments:

Post a Comment