మొలకల ర్యాప్ |
సగం కాల్చిన చపాతీలు - నాలుగు సన్నగా తరిగిన మెంతికూర - కప్పు ఉడికించిన పెసర మొలకలు - కప్పు నూనె - పావుకప్పు పచ్చిమిర్చి ముక్కలు - రెండు చెంచాలు పసుపు - పావుచెంచా ఉప్పు - తగినంత నిమ్మరసం -చెంచా.
గార్లిక్ స్ప్రెడ్ కోసం కావల్సినవి:
సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు - చెంచా ఉల్లిపాయ ముక్కలు - రెండు టేబుల్‌స్పూన్లు గడ్డ పెరుగు - అరకప్పు నూనె - చెంచా జీలకర్ర - అరచెంచా కారం - అరచెంచా ఇంగువ - చిటికెడు ఉప్పు - తగినంత.
ముందుగా గార్లిక్ స్ప్రెడ్ తయారుచేసుకోవాలి. బాణలిలో నూనె వేడిచేసి జీలకర్ర వేయించుకోవాలి. తరవాత వెల్లుల్లీ, ఉల్లిపాయ ముక్కలు వేయాలి. నిమిషం తరవాత దింపేసి ఈ మిశ్రమాన్ని పెరుగులో వేసి కలపాలి. తరవాత మిగిలిన పదార్థాలన్నీ వేసి కలిపి పెట్టుకోవాలి.
ఇప్పుడు మెంతి కూర చేసుకోవాలి. పొయ్యిమీద బాణలి పెట్టి చెంచా నూనె వేడిచేయాలి. అందులో పచ్చిమిర్చి ముక్కలు వేయించాలి. తరవాత కడిగి ఆరబెట్టిన మెంతికూర తరుగు వేసి వేయించాలి.
నిమిషం తరవాత ఉడికించి పెట్టుకున్న పెసర మొలకలూ, పసుపూ, తగినంత ఉప్పు వేసుకుని అన్నింటినీ బాగా కలపాలి. తడిపోయి, ఇది కూరలా తయారయ్యాక నిమ్మరసం వేసి దింపేయాలి.
ఇప్పుడు ర్యాప్ చేసుకోవాలి. పెనాన్ని పొయ్యిమీద పెట్టి, చపాతీలను నూనెవేసి కాల్చి తీసుకోవాలి. ఒకదాన్ని తీసుకుని దాని మధ్యలో మెంతికూర మిశ్రమాన్ని కొద్దిగా ఉంచాలి.
మిగిలిన చపాతీ భాగంలో ముందుగా చేసుకున్న గార్లిక్ స్ప్రెడ్‌ని రాసుకుని గట్టిగా రోల్‌లా చుట్టేసుకుంటే చాలు. ఇలా మిగిలిన చపాతీలను చేసుకోవాలి.
No comments:
Post a Comment