
తాటిపండు హల్వా
మరి కొన్ని హల్వా రుచులు |
సలహాలు & సూచనలు |
కావలసిన పదార్థాలు
* తాటిపండు గుజ్జు- ఒకటిన్నర కప్పు
* కార్న్ ఫ్లోర్- 1/2 కప్పు
* నీళ్ళు- 1/2 కప్పు
* పంచదార- 1/2 కప్పు
* యాలకుల పొడి- 1/4 టీ స్పూను
* నేతిలో వేగించిన డ్రైఫ్రూట్స్- 1/4 కప్పు
* నెయ్యి- 1 టేబుల్ స్పూను
* ఉప్పు- చిటికెడు.
తయారుచేయు విధానం
కడాయిలో నెయ్యి వేడిచేసి తాటిపండు గుజ్జు, ఉప్పు వేసి ఐదు నిమిషాలు సన్నటి సెగమీద కలుపుతూ ఉడికించాలి.
తరువాత నీటిలో కరిగించిన కార్న్‌ఫ్లోర్, పంచదార, డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి కూడా వేసి బాగా చిక్కబడే వరకూ కలుపుతూ ఉడికించాలి.
ఆ తరువాత మిశ్రమాన్ని నెయ్యి రాసిన పళ్ళెంలో సమానంగా పరిచి, చల్లారాక ముక్కలు కోయాలి.
No comments:
Post a Comment