
అలూచి వడి
మరి కొన్ని ఆవిరి రుచులు |
కావలసిన పదార్థాలు
*చామ ఆకులు(మీడియం సైజ్) - 20
ఫిల్లింగ్‌కు:
*శెనగపిండి - రెండున్నర కప్పులు
* బెల్లం తురుము - నాలుగు టేబుల్ స్పూన్లు
* నీళ్లలో నానబెట్టిన చింతపండుగుజ్జు - రెండు టేబుల్ స్పూన్లు
* పచ్చిమిర్చి - రెండు
* అల్లం - చిన్న ముక్క
* కారం
* పసుపు - ఒక్కోటి అర టీస్పూన్ చొప్పున
* ధనియాలు
* జీలకర్ర పొడులు
* నూనె - ఒక్కో టీస్పూన్ చొప్పున
* ఉప్పు - సరిపడా.
తాలింపుకు:
కరివేపాకు రెబ్బలు - కొన్ని
* నువ్వులు - రెండు టీ స్పూన్‌లు
* ఆవాలు - ఒక టీస్పూన్
* ఇంగువ - పావు టీస్పూన్
* కొబ్బరి తురుము - పావు కప్పు
* కొత్తిమీర తరుగు - కొద్దిగా.
తయారుచేయు విధానం
చామ ఆకును శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. తరువాత ఈనెలు తీసేయాలి. ఒక గిన్నెలో పిండికి అవసరమైన పదార్థాలన్నింటినీ వేసి చింతపండు గుజ్జు వేసి కలపాలి. అవసరమైతే నీటిని కలుపుకోవచ్చు. ఈ పిండి జారుగా కాకుండా చిక్కగా ఉండాలి. రుచి చూసి అవసరమైతే ఉప్పు, బెల్లం కలపొచ్చు.
ఒక ఆకు పై పిండి మిశ్రమాన్ని ఉంచి దాన్ని మరో ఆకుతో కప్పాలి. దానిపైన మరో ఆకు వేసి పిండి ఉంచి మరో ఆకు ఉంచి చివర్లను తిప్పాలి. రోల్ చేసిన వీటిని నూనె రాసిన ఇడ్లీకుక్కర్ ప్లేట్లలో ఉంచి ఇరవై నిమిషాల పాటు ఆవిరికి ఉడికించాలి.
అవి ఉడుకుతుండగానే మరోగిన్నెలో కొంచెం నూనె వేడి చేసి తాలింపు వేయాలి. ఉడికిన రోల్స్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక పళ్లెంలో ఉంచాలి. వాటిపై తాలింపు పోసి, కొబ్బరి తురుము, కొత్తిమీర తరుగుతో అలంకరించాలి. గ్రీన్ చట్నీతో తింటే బాగుంటాయి.
No comments:
Post a Comment