VTStyles

Recent Post

Saturday, 18 October 2014

Sweets - Halwa Poori

హల్వా పూరీ

కావలసినవిపరిమాణం
బొంబాయి రవ్వకప్పు
పంచదారకప్పు
నీళ్లురెండున్నర కప్పులు
బియ్యప్పిండిటేబుల్ స్పూను
జీడిపప్పు పలుకులుపావు కప్పు (చిన్న చిన్న ముక్కలుగా చేయాలి)
ఏలకుల పొడిఅర టీ స్పూను
నెయ్యి2 టేబుల్ స్పూన్లు
పై భాగం కోసంపరిమాణం
మైదా పిండికప్పు
ఉప్పుచిటికెడు
నూనె అర కప్పు (మైదా పిండి నానబెట్టడానికి)
నూనె డీప్ ఫ్రైకి తగినంత

తయారీ:

  • బాణలిలో నెయ్యి వేసి వేడి చేశాక, జీడిపప్పులు వేయించి తీసేయాలి
  • అదే బాణలిలో రవ్వ వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించి పక్కన ఉంచాలి
  • ఒక గిన్నెలో నీళ్లు పోసి మరిగించాక, వేయించి ఉంచుకున్న రవ్వ, జీడిపప్పు పలుకులు వేసి మిశ్రమం దగ్గరపడే వరకు కలిపి, ఆ తరవాత పంచదార జత చేయాలి
  • బియ్యప్పిండి, ఏలకుల పొడి వేసి బాగా కలిపి దించి, మిశ్రమం చల్లారాక, చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచాలి
  • ఒక పాత్రలో మైదా పిండి, ఉప్పు వేసి బాగా కలిపి తగినన్ని నీళ్లు జత చేసి చపాతీ పిండిలా కలిపి, అర కప్పు నూనె జత చేసి బాగా కలిపి సుమారు రెండు గంటలు నానబెట్టాలి
  • చేతికి నెయ్యి రాసుకుని నానబెట్టుకున్న మైదాపిండి ముద్ద తీసుకుని, చేతితో చపాతీలా ఒత్తి, అందులో బొంబాయిరవ్వ మిశ్రమం ఉండను ఉంచి, బొబ్బట్టు మాదిరిగా సజ్జప్పం ఒత్తాలి. ఇలా మొత్తం తయారుచేసి పక్కన ఉంచుకోవాలి
  • బాణలిలో నూనె కాగాక ఒక్కో సజ్జప్పం వేసి వేయించి తీసేయాలి

  • ఇవి సుమారు రెండు మూడు రోజులు నిల్వ ఉంటాయి.

No comments:

Post a Comment