జామకాయ పచ్చడి |
జామ కాయలు - 2 పచ్చిమిర్చి - 6 పచ్చి టొమాటోలు - 2 జీలకర్ర - టీ స్పూను చింతపండు గుజ్జు - 2 టీ స్పూన్లు కొత్తిమీర - చిన్న కట్ట ఉప్పు - తగినంత నూనె - 4 టీ స్పూన్లు కరివేపాకు - రెండు రెమ్మలు ఆవాలు - టీ స్పూను మినప్పప్పు - టీ స్పూను మెంతులు - అర టీ స్పూను
ముందుగా జామకాయలపై తొక్కు కొద్దిగా మందంగా తీసేసి, ముక్కలు చేయాలి గింజల భాగాన్ని విడిచిపెట్టేయాలి
బాణలిలో నూనె వేసి కాగాక, పచ్చి మిర్చి, జీలకర్ర, కొత్తిమీర వేసి ఒక నిమిషం పాటు వేయించి తీసి పక్కన ఉంచాలి మిగిలిన నూనెలో ముందుగా జామ కాయ ముక్కలను వేసి మెత్తబడేవరకు సుమారు ఐదు నిమిషాలు వేయించి తీసేయాలి
అదే బాణలిలో టొమాటో ముక్కలు కూడా వేసి మెత్తబడే వరకు వేయించి తీసేయాలి వేరే బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఆవాలు, మినప్పప్పు, మెంతులు, కరివేపాకు, పసుపు, ఇంగువ ఒక దాని తరవాత ఒకటి వేసి పోపు వేయించి తీసేయాలి మిక్సీలో ముందుగా కొత్తిమీర మిశ్రమం వేసి మెత్తగా అయ్యాక, జామకాయ ముక్కలు, టొమాటో ముక్కలు ఒక దాని తరవాత ఒకటి వేసి మెత్తగా అయ్యేవరకు తిప్పాలి
చింతపండు గుజ్జు జత చేసి మరో మారు తిప్పి చిన్న పాత్రలోకి తీసుకోవాలి వేయించి ఉంచుకున్న పోపు వేసి కలపాలి
ఏ టిఫిన్‌లోకైనా చట్నీలా బావుంటుంది.
No comments:
Post a Comment