ధవళేశ్వరం జనార్దనస్వామి జీళ్లు |
బెల్లం తురుము - కేజీ (బూరుగపూడి బెల్లం శ్రేష్ఠం) నెయ్యి - 100 గ్రా ఏలకుల పొడి - 3 టీ స్పూన్లు బాగా మందంగా ఉన్న మేకు - 1 (గోడకు గాని, తలుపుకు కాని బిగించాలి)
ఒక మందపాటి పాత్రలో బెల్లం తురుము, కొద్దిగా నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి ఆపకుండా కలుపుతుండాలి.బెల్లం కరిగి ఉండ పాకం వచ్చాక మరి కాసేపు ఉంచి దించేయాలి.గరిటెతో బాగా కలపాలి.
ఒకమాదిరి గట్టిగా అయిన తర్వాత ఆ మిశ్రమం పొడవాటి పలుచటి కడ్డీ మాదిరిగా తయారవుతుంది.అప్పుడు ఆ మిశ్రమాన్ని మేకుకి వేసి పొడవుగా లాగుతుండాలి.సుమారు పావు గంట సేపు లాగిన తర్వాత బెల్లం గట్టి పడుతుంది
అప్పుడు వెడల్పాటి బల్ల మీద ఉంచి గుండ్రంగా రోల్ చేసి బియ్యప్పిండి, నువ్వుపప్పు అద్దుతూ రోల్ చేయాలి.మనకు కావలసిన పరిమాణంలోకి వచ్చేవరకు రోల్ చేసి చాకు సహాయంతో చిన్న సైజులోకి జీళ్లను కట్ చేయాలి.
బాగా ఆరిన తర్వాత గాలి చొరని డబ్బాలోకి తీసి నిల్వ చేసుకోవాలి.
No comments:
Post a Comment