VTStyles

Recent Post

Saturday, 10 October 2015

CommonMeal_ - Curry - Veg - BabyCorn Capsicum Curry

బేబి కార్న్‌ కాప్సికం కర్రీ


బేబీ కార్న్‌ - 3 కాప్సికం తరుగు - 1 కప్పు ఉల్లి తరుగు - అర కప్పు టమోటా తరుగు - అరకప్పు అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను పసుపు - చిటికెడు మసాలా పొడి - 1 టీ స్పూను ధనియాలపొడి - అర టీ స్పూను పచ్చి కొబ్బరి పేస్టు - అరకప్పు కొత్తిమీర తరుగు - 1 టేబుల్‌ స్పూను ఉప్పు - రుచికి తగినంత నూనె - 1 టేబుల్‌ స్పూను తాలింపు కోసం (మినప్పప్పు+ఆవాలు+జీలకర్ర) - 1 టీ స్పూను.

  • బేబీ కార్న్‌లని చక్రాల్లా తరిగి కుక్కర్లో కొద్ది నీరుపోసి ఉడికించి పక్కనుంచాలి. కడాయిలో నూనె వేసి తాలింపు వేగాక ఉల్లిపాయ తరుగు, అల్లం పేస్టు, పసుపు వేగించాలి.

  • కాప్సికం, టమోటా ముక్కలు, ధనియాలపొడి, ఉప్పు, మసాలపొడి వేసి అరకప్పు నీటిని జతచేయాలి.

  • కాప్సికం ముక్కలు మెత్తబడ్డాక ఉడికిన బేబీకార్న్‌ కూడా వేసి 3 నిమిషాల తర్వాత కొబ్బరి పేస్టు కలపాలి.

  • రెండు నిమిషాలాగి కొత్తిమీర చల్లి దించేయాలి.

  • ఇది కూడా పరాటాల్లోకి చాలా రుచిగా ఉంటుంది.

No comments:

Post a Comment