బేబీ కార్న్ మసాలా గ్రేవీ |
బేబీ కార్న్ ముక్కలు - 1 కప్పు ఉల్లి తరుగు - అరకప్పు క్యారెట్ పచ్చిబఠాణి క్యారెట్ తరుగు - పావు కప్పు చొప్పున పచ్చిమిర్చి - 1 నూనె - 2 టేబుల్ స్పూన్లు అల్లంవెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను టమోటా తరుగు - ముప్పావు కప్పు ఉప్పు కారం - రుచికి తగినంత గరం మసాల పొడి - ఒకటిన్నర టీ స్పూను పసుపు - చిటికెడు కొబ్బరి పాలు - పావు కప్పు బిర్యాని ఆకు - 1 లవంగాలు - 6 దాల్చిన చెక్క - అంగుళం ముక్క షాజీరా - పావు టీ స్పూను మిరియాలు - 5.
నూనెలో బేబీ కార్న్ ముక్కల్ని పెద్దమంటపై మాడకుండా వేగించి పక్కనుంచాలి. అదే పాన్‌లో కూరగాయల తరుగు వేగించి తీసేయాలి.
మరి కొద్ది నూనె వేసి మసాల దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్టు, టమోటా తరుగు, ఉప్పు, కారం, గరం మసాల పొడి ఒకటి తర్వాత ఒకటి వేగించి, నిమిషం తర్వాత కొబ్బరి పాలతో పాటు మరికొద్ది నీరు పోసి మరిగించాలి.
. ఇప్పుడు వేగించిన బేబీకార్న్ కలిపి మూతపెట్టి 3 నిమిషాల తర్వాత దించేయాలి.
పరాటాలతో చాలా రుచిగా ఉండే మసాల కూర ఇది.
No comments:
Post a Comment