VTStyles

Recent Post

Sunday, 1 November 2015

CommonMeal - Curry - Veg - Pumpkin Paalak Curry

గుమ్మడికాయ పాలకూర కర్రీ


గుమ్మడి ముక్కలు - 1 కప్పు లేత పాలకూర తరుగు - 3 కప్పులు నూనె - 2 టేబుల్‌ స్పూన్లు ఉల్లి తరుగు - 1 కప్పు వెల్లుల్లి తరుగు - 1 టీ స్పూను ఆవాలు జీలకర్ర - పావు టీ స్పూను చొప్పున కరివేపాకు - 4 రెబ్బలు కూర పొడి - 4 టేబుల్‌ స్పూన్లు నీరు - 2 కప్పులు కొబ్బరిపాలు - 1 కప్పు.

  • నూనెలో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లి, వెల్లుల్లి ఒకటి తర్వాత ఒకటి వేగించాలి. అవి వేగాక 3 టేబుల్‌ స్పూన్ల కూరపొడితో పాటు గుమ్మడి ముక్కలు కూడా వేసి మూత పెట్టాలి.

  • రెండు నిమిషాల తర్వాత నీరు పోసి ఉడికించాలి. నీరు కొద్దిగా ఉండగానే కొబ్బరిపాలు పోసి, మిగిలిన కూరపొడి చల్లాలి.

  • కూర చిక్కబడ్డాక పాలకూర తరుగు వేసి ఒక నిమిషం ఉంచి దించేయాలి. ఇష్టమయితే టీ స్పూను బెల్లం పొడి చల్లుకోవచ్చు.

  • ఈ కూర అన్నంతో పాటు పరాటాలతో కూడా బాగుంటుంది.

No comments:

Post a Comment