గుమ్మడి వేపుడు |
గుమ్మడికాయ అర కేజి ఎండుమిర్చి 8 వెల్లుల్లి రేకలు 6 చింతపండు గుజ్జు 2 టేబుల్ స్పూన్లు (చింతపండుని 15 నిమిషాల పాటు నీటిలో నానబెట్టి గుజ్జులా చేయాలి) ఉప్పు నూనె తగినంత తురిమిన కొత్తిమీర కొద్దిగా.
గుమ్మడికాయని శుభ్రం చేసి చిన్న ముక్కలుగా తరగాలి. బాణలిలో నూనెని వేడి చేసి ముందు ఎండుమిర్చిని వేగించాలి (అవి మాడిపోకుండా చూడాలి).
వాటిని బయటికి తీసి చల్లారిన తర్వాత వేళ్లతో ఒత్తి బరకగా పొడుం చేయాలి. అదే నూనెని మళ్లీ వేడి చేసి చితక్కొట్టిన వెల్లుల్లి రేకల్ని వేసి వేగించి ఆ తర్వాత గుమ్మడి ముక్కల్ని వేసి బాగా కలపాలి.
ఈ ముక్కలు దాదాపుగా ఉడికిన తర్వాత బంగారు రంగు వచ్చేందుకు మంటను హై లో పెట్టి కలపాలి. తర్వాత చింతపండు గుజ్జు, ఎండుమిర్చి పొడుం, తరిగిన కొత్తిమీర, ఉప్పు వేసి కలపాలి.
No comments:
Post a Comment