పొట్లకాయతో మునగాకు |
పొట్లకాయ - ఏడు అంగుళాల పొడవు ముక్క మునగాకు - 1 కప్పు ఉల్లిపాయ - 1 వెల్లుల్లి - 5 రేకలు శనగపప్పు - 1 టేబుల్ స్పూను సోంపు - అర టీ స్పూను ఎండుమిర్చి - 3 పసుపు - చిటికెడు ఉప్పు - రుచికి సరిపడా నూనె - అర టీ స్పూను తిరగమోత దినుసులు - సరిపడా.
తొక్క, గింజలు తీసిన పొట్లకాయను చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి.
నూనెలో శనగపప్పు, సోంపు, ఎండుమిర్చి ఒకటి తర్వాత ఒకటి వేగించి చల్లారిన తర్వాత బరకగా పొడిచేసుకోవాలి.
ఇప్పుడు నూనెలో తాలింపుతో పాటు వెల్లుల్లి, ఉల్లి తరుగు వేగించి, పొట్లకాయముక్కలు, పసుపు, ఉప్పు కలిపి మూత పెట్టి చిన్న మంటపై మగ్గించాలి.
ముక్కలు ఉడికిన తర్వాత పొడితో పాటు మునగాకులు వేసి తడి పోయేవరకు కలిపి దించేయాలి.
వేడి వేడి అన్నంతో ఈ కూర చాలా బాగుంటుంది.
No comments:
Post a Comment