పొట్లకాయ తెలగపిండి |
పొట్లకాయ - 1 తెలగపిండి - 1 కప్పు నూనె - 1 టేబుల్ స్పూను ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు - అర టీ స్పూను చొప్పున కరివేపాకు - 4 రెబ్బలు (నిలువుగా తరిగిన) వెల్లుల్లి రేకలు - 6 ఉప్పు - రుచికి తగినంత పసుపు - చిటికెడు.
పొట్లకాయని చిన్న ముక్కలుగా తరిగి, కొద్దిపాటి నీటిలో ముక్క సగంపైగా ఉడికేదాకా ఉంచి నీరు వంచేసి పక్కనుంచాలి.
కడాయిలో నూనె వేసి జీరా, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు చిటపటమన్నాక పొట్ల ముక్కలు, కరివేపాకు వేసి కలపాలి.
తర్వాత పసుపు, ఉప్పు, తెలగపిండి వేసి సన్నని సెగమీద ఉడికించాలి. విడిగా దోరగా వేగించిన వెల్లుల్ని తరుగుని పైన చల్లాలి.
ఈ కూర అన్నంతో చాలా రుచిగా ఉంటుంది.
No comments:
Post a Comment