అండే ఔర్ బాదం కీ లౌజ్ |
కోడిగుడ్లు: నాలుగు కోవా: 150 గ్రా. పంచదార: 75 గ్రా. యాలకులపొడి: 2 టీస్పూన్లు బాదంపొడి: 2 టేబుల్‌స్పూన్లు నెయ్యి: 2 టేబుల్‌స్పూన్లు
గుడ్లను పగులగొట్టి పచ్చసొనల్నీ తెల్లసొనల్నీ వేరుచేయాలి.
ఓ గిన్నెలో పచ్చసొనలూ పంచదారా వేసి అది కరిగేవరకూ బాగా గిలకొట్టాలి. అందులోనే బాదంపొడి, యాలకులపొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు కోవా తురుము, నెయ్యి వేసి బాగా కలపాలి.
ఓ గిన్నెలో తెల్లసొనల్ని వేసి బాగా నురుగు వచ్చేలా గిలకొట్టాలి. ఇప్పుడు దీన్ని పచ్చసొనల మిశ్రమంలో జాగ్రత్తగా పోసి కలపాలి.
ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని కేకు గిన్నెలో పోసి బేక్ చేసి తియ్యాలి.
No comments:
Post a Comment