![]() |
మరి కొన్ని హల్వా రుచులు |
సలహాలు & సూచనలు |
కావలసిన పదార్థాలు
*కోడిగుడ్లు: నాలుగు
* సెనగపిండి: 2 టేబుల్‌స్పూన్లు
* బొంబాయిరవ్వ: టేబుల్‌స్పూను
* పంచదార: 5 టేబుల్‌స్పూన్లు
* యాలకులపొడి: 2 టీస్పూన్లు
* కోవా: 100 గ్రా.
* నెయ్యి: 2 టేబుల్‌స్పూన్లు
తయారుచేయు విధానం
బొంబాయిరవ్వను కాసిని నీళ్లలో నానబెట్టి పక్కన ఉంచాలి.
ఓ గిన్నెలో కోడిగుడ్ల సొనలు వేసి అందులోనే పంచదార వేసి అది కరిగేవరకూ కలపాలి.
నాన్‌స్టిక్ గిన్నెలో నెయ్యి వేసి కరిగించాలి. అందులోనే సెనగపిండి, నానబెట్టిన బొంబాయిరవ్వను వేసి సిమ్‌లో మంచి వాసన వచ్చేవరకూ నెమ్మదిగా వేయించాలి.
ఇప్పుడు కోడిగుడ్ల మిశ్రమాన్ని వేసి నెమ్మదిగా కలుపుతూ ఉడికించాలి. చిక్కగా అయ్యాక కోవా, యాలకుల పొడి వేసి అది పాన్‌కు అతుక్కోకుండా ఉండేవరకూ ఉడికించి దించాలి. బాదం, కోవాలతో అలంకరించి అందించాలి.
No comments:
Post a Comment