![]() |
మరి కొన్ని బిరియాని రుచులు |
సలహాలు & సూచనలు |
కావలసిన పదార్థాలు
*
చికెన్ - ఒక కిలో
* బాస్మతి బియ్యం - ఒక కిలో
* గరం మసాలా - రెండు టీ స్పూన్లు
* అల్లం ముద్ద - ఒక టేబుల్ స్పూను
* నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు
* వెల్లుల్లి ముద్ద - ఒక టేబుల్ స్పూను
* పెరుగు - ఒక కప్పు
* ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు
* పచ్చిమిరపకాయలు - ఐదు
* ఎండు మిరపకాయలు - ఆరు
* పసుపు - చిటికెడు
* కొత్తిమీర - ఒక కట్ట
* ఉప్పు - తగినంత
* నూనె - సరిపడా.
తయారుచేయు విధానం
ముందుగా మాంసాన్ని శుభ్రంగా కడిగి కొద్దిగా పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద, పెరుగు వేసి బాగా కలిపి రెండు గంటల సేపు నానబెట్టాలి.
బియ్యాన్ని కడిగి ఆర బెట్టాలి. ఐదు నిమిషాల తర్వాత వంతుకు రెండొంతులు నీళ్లు పోసి పొయ్యి మీద ఉడికించాలి.
స్టౌ మీద మరో గిన్నె పెట్టి సరిపడా నూనె వేసి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఇప్పుడు పెరుగులో నానబెట్టిన మాంసాన్ని కొద్దిగా వేసి దానిపైన సగం ఉడికిన అన్నాన్ని వేయాలి.
మళ్లీ ఒక పొర మిగతా మాంసాన్ని వేయాలి. దానిపై మిగిలిన అన్నాన్ని వేసి మూతపెట్టాలి. ఆవిరి బయటికి పోకుండా ఉండటానికి మూత అంచుకి మెత్తగా కలిపిన మైదా పిండిని పెట్టాలి.
పిండి మొత్తం ఆరిపోయి పెచ్చులుగా వచ్చేసే వరకూ ఉడికించి దించేయాలి. ఘుమఘుమలాడే బిర్యాని తయారయినట్టే. చివర్లో కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలతో అలంకరించుకోవాలి.
No comments:
Post a Comment