స్పెషల్ చికెన్ శాండ్‌విచ్ |
బ్రెడ్ ముక్కలు- ఆరు చికెన్(బోన్‌లెస్)- పావు కేజి పెరుగు- ఒక కప్పు అల్లం(తరిగి)- ఒక టీస్పూను వెల్లుల్లి(తరిగి)- రెండు రెబ్బలు పచ్చిమిర్చి (తరిగి)- రెండు జీలకర్ర- అరటీస్పూను ఉల్లిపాయ(తరిగి)- ఒకటి ఉప్పు- తగినంత పుదీనా చట్నీ- రెండు టేబుల్‌స్పూన్లు ధనియాల పొడి- పావు టీస్పూను.
పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, జీలకర్ర అన్నింటినీ కలిపి గ్రీన్ చట్నీ తయారు చేయాలి. ఒక గిన్నెలో చికెన్, గ్రీన్‌చట్నీ, పెరుగు, ఉప్పు, ధనియాలపొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పావుగంటసేపు నానబెట్టాలి.
పాన్‌లో రెండు టీస్పూన్ల నూనె వేడి చేసి చికెన్ మిశ్రమాన్ని రెండు నిమిషాలు వేగించాలి. ఆ తరువాత మూతపెట్టి పది నిమిషాలపాటు ఉడికించాలి.
ముక్కలు ఉడికిన తరువాత స్టవ్ ఆపేసి ఈ మిశ్రమాన్ని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. బ్రెడ్ ముక్కలకి ఒక్కోవైపు పుదీనా చట్నీ రాసి మధ్యలో చల్లారిన చికెన్ మిశ్రమం పెట్టాలి. అంతే చికెన్ శాండ్‌విచ్ రెడీ. ఇది చూడడానికే కాదు తింటున్నా యమ్మీ యమ్మీగా ఉంటుంది.
No comments:
Post a Comment