![]() |
మరి కొన్ని పిజ్జా రుచులు |
కావలసిన పదార్థాలు
* గుడ్లు- నాలుగు
* బ్రెడ్ ముక్కలు- ఎనిమిది
* కీరదోస ముక్కలు- అరకప్పు
* టొమాటో(సన్నగా తరిగి)- రెండు
* ఉల్లిపాయలు(తరిగి)- అరకప్పు
* పాలు- ఒక కప్పు
* ఉప్పు- తగినంత
* మిరియాలపొడి- ఒక టీస్పూను
* ఆలివ్ ఆయిల్
* చీజ్- రెండు టేబుల్స్పూన్ల చొప్పున.
తయారుచేయు విధానం
ఒక గిన్నెలో కోడిగుడ్ల సొనను పోసి, దానిలో పాలు, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి. బ్రెడ్ ముక్కల్ని ఈ మిశ్రమంలో ముంచి పెనంపై నూనె వేసుకుంటూ గోధుమరంగులోకి వచ్చే వరకు కాల్చాలి.
మరొక గిన్నెలో చీజ్, కొద్దిగా నూనె, కూరగాయ ముక్కలు, మిరియాల పొడి, చిటికెడు ఉప్పు వేసి బాగా కలపాలి.
బ్రెడ్ముక్కలకి ఒకవైపు టొమాటో సాస్ లేదా పుదీనా చట్నీ రాసి మధ్యలో కూరగాయల మిశ్రమం పెట్టి సర్వ్ చేయాలి.
No comments:
Post a Comment