![]() |
మరి కొన్ని పిజ్జా రుచులు |
కావలసిన పదార్థాలు
*మిరియాలు- ఒకటిన్నర టీస్పూను
* ఉప్పు- అరటీస్పూను
* చీజ్ తురుము
* పాలకూర(తరిగి)- అరకప్పు చొప్పున
* అల్లం వెల్లుల్లి పేస్టు- రెండు టీస్పూన్లు
* ఉల్లిపాయలు(తరిగి)- ఒకటి
* పచ్చిమిర్చి(తరిగి)- ఒకటి
* కొత్తిమీర తరుగు- పావుకప్పు
* బ్రెడ్ ముక్కలు- ఎనిమిది
* మటన్(బోన్‌లెస్)- పావుకేజీ
* జీలకర్ర పొడి- పావుటీస్పూను
* వెన్న- ఒక టేబుల్‌స్పూను.
తయారుచేయు విధానం
ఒక పాన్‌లో వెన్న వేడి చేసి ఉల్లిపాయలు వేగించాలి. ఉల్లిపాయలు గోధుమరంగులోకి వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్టు వేసి రెండు నిమిషాలు వేగించాలి.
తరువాత మటన్‌తోపాటు ఉప్పు, జీలకర్రపొడి, మిరియాలపొడి, పచ్చిమిర్చి వేసి ఉడికించాలి. మటన్ ఉడికాక కొత్తిమీర చల్లి స్టవ్ ఆపేయాలి
ఒక బ్రెడ్ ముక్కపై వెన్న రాసి మటన్ మిశ్రమం పెట్టి దానిపై పాలకూర, చీజ్ ఉంచి దానిపై వెన్న రాసిన మరొక బ్రెడ్ పెట్టాలి. అంతే.. టేస్టీ టేస్టీ మటన్ శాండ్‌విచ్ రెడీ.
No comments:
Post a Comment