ఆలూ మసాలా శాండ్‌విచ్ |
బంగాళాదుంపలు(ఉడికించిన)- నాలుగు గరం మసాలా చాట్ మసాలా- ఒక్కో టీస్పూను చొప్పున పచ్చిమిర్చి (తరిగి)- మూడు కొత్తిమీర తరుగు- రెండు టేబుల్‌స్పూన్లు కారం- ఒక టేబుల్‌స్పూను ఉప్పు- తగినంత ఉల్లిపాయలు(తరిగి) బ్రెడ్ ముక్కలు- రెండు చొప్పున పుదీనా చట్నీ పనీర్ తరుగు- రెండు టేబుల్ స్పూన్ల చొప్పున.
ఉడికించిన బంగాళాదుంపలను ఒక గిన్నెలోకి తీసుకొని మెత్తగా మెదపాలి. దానిలో గరంమసాలా, పచ్చిమిర్చి, కొత్తిమీర, కారం, ఉప్పు, చాట్‌మసాలా, ఉల్లిపాయలు వేసి బాగా కలపాలి. కావాలంటే దీనిలో ఆమ్‌చూర్ పొడి లేదా నిమ్మరసం కూడా వేసుకోవచ్చు.
ఒక బ్రెడ్ ముక్కలపై రెండు స్పూన్ల బంగాళాదుంప మిశ్రమాన్ని పెట్టి బ్రెడ్ మొత్తం పరచాలి. మరొక బ్రెడ్ ముక్కపై పుదీనా చట్నీ రాయాలి.
ఈ రెండు బ్రెడ్ ముక్కల్ని కలిపి పెనంపై లేదా గ్రిల్‌పై కొద్దిసేపు వేగించాలి. అంతే ఆహా అనిపించే ఆలూ మసాలా శాండ్ విచ్ రెడీ అవుతుంది.
No comments:
Post a Comment