VTStyles

Recent Post

Wednesday, 25 May 2016

Bakery - Cake - Butter Scotch Cake

బటర్‌స్కాచ్‌ కేక్‌


మైదాపిండి-100గ్రా వెన్న-100గ్రా పంచదార పొడి-100గ్రా బేకింగ్‌ పౌడర్‌-ఒక టీ స్పూన్‌ వంట సోడా-అర టీ స్పూన్‌ పాలపొడి-రెండు టేబుల్‌ స్పూన్లు బటర్‌స్కాచ్‌ ఎసెన్స్‌-ఒక టీ స్పూన్‌ లెమన్‌ ఎల్లో ఫుడ్‌ కలర్‌-తగినంత.

ఐసింగ్‌ కోసం :

వెన్న-100గ్రా ఐసింగ్‌ షుగర్‌-200గ్రా లెమన్‌ ఎల్లో కలర్‌-కొన్ని చుక్కలు బటర్‌స్కాచ్‌ కాండీస్‌-అర కప్పు వేడినీరు-కొద్దిగా.

  • ఒక పాత్రలో కొంత మైదాపిండి, బేకింగ్‌ పౌడర్‌, వంట సోడా, పాలపొడి, వెన్న, పంచదార వేసి కలపాలి.

  • తరువాత ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి గిలకొట్టాలి. దీనికి బటర్‌స్కాచ్‌ ఎసెన్స్‌, లెమన్‌ ఎల్లో ఫుడ్‌ కలర్‌ చేర్చి మళ్లీ ఒకసారి మిక్సీలో గిలకొట్టాలి. మరీ పలచగా అనిపిస్తే మైదాపిండిని కొద్దికొద్దిగా చేర్చుతూ మళ్లీ మిక్సీలో గిలకొట్టాలి.

  • తరువాత ఎలకి్ట్రక్‌ ఓవెన్‌లోని గిన్నెలో కొద్దిగా డాల్డా రాసి, ఈ మిశ్రమాన్ని ఆ గిన్నెలో పోసి 180 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత వద్ద 40-50 నిమిషాలు బేక్‌ చేయాలి. బేకింగ్‌ పూర్తయి చల్లారాక కేక్‌పైన ఐసింగ్‌ చేయాలి.

  • ఐసింగ్‌ ఇలా : వెన్న, ఐసింగ్‌ షుగర్‌లను ఒక పాత్రలో వేసి నురుగు వచ్చేంత వరకు గిలకొట్టాలి. దీనికి ఎసెన్స్‌, ఫుడ్‌ కలర్‌, కొద్దిగా వేడినీరు చేర్చి మళ్లీ గిలకొట్టాలి. ఈ మిశ్రమాన్ని కేక్‌పైన పల్చగా పోసి బటర్‌ నైఫ్‌ సహాయంతో కేక్‌ అంతటా సమంగా సర్దాలి. ఆపైన బటర్‌స్కాచ్‌ క్యాండీస్‌తో అలంకరించాలి.

  • ాన్‌వెజ్‌ను ఇష్టపడేవారు గుడ్డును కూడా బటర్‌స్కాచ్‌ కేక్‌లో కలుపుకోవచ్చు

No comments:

Post a Comment