ఆలు ఆవడ |
ఉడికించిన బంగాళ దుంపలు- 2 వేగించిన మినపప్పు పొడి- 3 టేబుల్ స్పూన్లు శనగపిండి- 2 టేబుల్ స్పూన్లు పెరుగు- 2 కప్పులు అల్లం తరుగు- 1/2 టీ స్పూను పచ్చిమిర్చి తరుగు- 1/2 టీ స్పూను కొత్తిమీర తరుగు- 1/2 టీ స్పూను కారం- 1/4 టీ స్పూను ఉప్పు- రుచికి సరిపడా ఉల్లిపాయ- 1 నూనె వేగించడానికి సరిపడా.
పెరుగులో ఉప్పు, కారం, ఉల్లిపాయ తరుగు, కొత్తిమీద కలిపి, పోపు పెట్టి పక్కన ఉంచాలి.
తరువాత బంగాళా దుంపలను చిదిమి, ఉప్పు, మినపప్పు పౌడర్, శనగపిండి, అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు కలిపి గారెల పిండిలా కలపాలి.
తరువాత ఒక కడాయిలో నూనె వేడిచేసి బంగాళాదుంప మిశ్రమంతో గారెలు వేసుకుని, దోరగా వేగాక వాటిని తీసి పెరుగు మిశ్రమంలో వెయాలి.
No comments:
Post a Comment