బ్రెడ్ ఆవడ |
బ్రెడ్ స్లైసులు- 4 పెరుగు- 1 కప్పు ఉప్పు- రుచికి సరిపడా పంచదార- 1/4 స్పూను శనగపిండి- 1 టేబుల్ స్పూను కారం- 1/4 టీ స్పూను కొత్తిమీర తరుగు- 1/2 టీ స్పూను అల్లం తరుగు- 1/4 టీ స్పూను పోపుదినుసులు- 1 టీ స్పూను కరివేపాకు- 1 రెబ్బ నూనె- వేగించడానికి సరిపడా ఉల్లిపాయ- 1 పచ్చిమిర్చి- 1.
పెరుగులో అల్లం, కొత్తిమీర, ఉప్పు, ఉల్లి, పచ్చిమిర్చి తరుగు వేసి బాగా కలపాలి. తరువాత కొద్దిగా నూనె వేడి చేసి తాలింపు దినుసులు, కరివేపాకు వేగించి పెరుగుకు పోపుపెట్టి పక్కన ఉంచాలి.
తరువాత శనగపిండిలో ఉప్పు, కారం వేసి కొద్దిగా నీళ్ళు పోసి జారుగా కలిపి ఉంచాలి.
ఆ తరువాత ఒక్కో బ్రెడ్ స్లైసును రెండుమూడు ముక్కలుగా చేసి శనగపిండి మిశ్రమంలో ముంచి పెనం మీద రెండు వైపులా వేగించి పెరుగు మిశ్రమంలో వేయాలి.
No comments:
Post a Comment