ఓట్స్ ఆవడ |
ఓట్స్- 2 టేబుల్ స్పూన్లు పెసరపప్పు- 1/4 కప్పు మినప్పప్పు- 1/4 కప్పు బేకింగ్ పౌడర్- 1/4 టీ స్పూను నూనె- వేగించడానికి సరిపడా ఉప్పు- రుచికి సరిపడా పెరుగు- 2 కప్పులు కారం- 1/4 టీ స్పూను అల్లం తరుగు- 1/4 టీ స్పూను ఉల్లిపాయలు- 2 పచ్చిమిర్చి- 2 కరివేపాకు- 1 రెబ్బ తాలింపు దినుసులు- 1 టీ స్పూను.
పెసరపప్పు, మినపప్పులను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పావుకప్పు నీళ్ళు పోసి రుబ్బుకోవాలి.
తరువాత ఓట్స్‌ను దోరగా వేగించి పొడిచేసి రుబ్బిపెట్టుకున్న పిండిలో కలిపి, బేకింగ్ పౌడర్, ఉప్పు కూడా వేసి అరగంట నానబెట్టాలి.
పెరుగులో ఉప్పు, కారం, అల్లం, ఉల్లి, పచ్చిమిర్చిల తరుగు కలిపి, పోపు పెట్టి పక్కన ఉంచాలి.
ఆ తరువాత గుంట పొంగడాల పెనం గుంటలకు నూనె రాసి, వాటిలో పిండి నింపి రెండు వైపులా వేగించి పెరుగు మిశ్రమంలో వేయాలి.
No comments:
Post a Comment