VTStyles

Recent Post

Friday, 20 May 2016

Breakfast - Upma - Bombay Rava Perugu Upma

పెరుగు ఉప్మా


బొంబాయి రవ్వ - 2 కప్పులు ఉల్లిపాయ -1 పచ్చిమిర్చి - 3 అల్లం తరుగు - 1 టీ స్పూను కరివేపాకు - 4 రెబ్బలు (వేగించిన) వేరుశనగపప్పు - 1 టేబుల్‌ స్పూను నెయ్యి - ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు ఆవాలు + మినప్పప్పు -1 టీ స్పూను పుల్ల పెరుగు - 2 కప్పులు ఉప్పు - రుచికి తగినంత.

  • రవ్వని అర టేబుల్‌ స్పూను నెయ్యిలో దోరగా వేగించి, చల్లారనిచ్చి పెరుగులో వేసి అరగంట నానబెట్టాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి (గింజలు తీసి) సన్నగా, పొడుగ్గా తరగాలి. కడాయిలో మిగిలిన నెయ్యి వేసి మినప్పప్పు, ఆవాలు చిటపటమన్నాక, కరివేపాకు, ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి తరుగు, వేరుశనగపప్పు వేసి వేగించాలి.

  • తర్వాత 4 కప్పుల నీరు పోసి, ఉప్పు వేయాలి. నీరు మరుగుతున్నప్పుడు పెరుగులో నానబెట్టిన రవ్వని వేసి అడుగంటకుండా సన్న సెగమీద తిప్పుతూ ఉడకనివ్వాలి. ఈ ఉప్మా పుల్లపుల్లగా చాలా రుచిగా ఉంటుంది.

No comments:

Post a Comment