VTStyles

Recent Post

Thursday, 5 May 2016

Breakfast - Dokla

ఢోక్లా


కావల్సినవి: శనగపిండి - 2 కప్పులు పెరుగు - కప్పు; ఉప్పు - తగినంత పసుపు - అర టీ స్పూన్ పచ్చిమిర్చి ముద్ద - అర టీ స్పూన్ అల్లం ముద్ద - అర టీ స్పూన్ నూనె - 2 టేబుల్ స్పూన్లు నిమ్మరసం - టేబుల్ స్పూన్ వంటసొడా - టీ స్పూన్; ఆవాలు - టీ స్పూన్ కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి తరుగు - అర కప్పు

  • వెడల్నాటి గిన్నెలో శనగపిండి, బాగా గిలక్కొట్టిన పెరుగు, కప్పు వేడి నీళ్లు పోసి ఉండలు లేకుండా కలపాలి. దీంట్లో ఉప్పు వేసి మరోసారి బాగా కలపాలి. 3-4 గంటలు వదిలేయాలి.

  • తర్వాత పసుపు, పచ్చిమిర్చి ముద్ద వేసి కలపాలి.ఢోక్లా చేసే గిన్నె అడుగున నెయ్యి రాయాలి. (కుకర్ లో కూరగాయలను ఉడికించడానికి మరో అల్యూమీనియమ్ పాత్ర వస్తుంది. దీనిని వాడచ్చు) చిన్న గిన్నెలో నిమ్మరసం, సొడా, టీ స్పూన్ నూనె వే సి కలపాలి. ఈ మిశ్రమాన్ని పిండిలో వేసి మరోసారి బాగా కలపాలి.

  • ఈ పిండిని నెయ్యి రాసిన గిన్నెలో పోయాలి.కుకర్ అడుగు భాగాన నీళ్లుపోసి, దానిపైన పిండి మిశ్రమం ఉన్న గిన్నెపెట్టాలి, పైన మూతపెట్టాలి కానీ, వెయిట్ (విజిల్)ను పెట్టకూడదు.మంట మీద కనీసం 20 నిమిషాలు ఉడికించాలి.

  • మధ్య మధ్యలో నీళ్లు ఆవిరైపోయాయో లేదో సరిచూసుకుంటూ మరో 2 కప్పుల నీళ్లు కుకర్ అడుగు భాగాన పోస్తూ ఢోక్లాను పూర్తిగా ఉడనివ్వాలి.

  • ఢోక్లా ఉన్న గిన్నెను బయటకు తీసి, ప్లేట్‌లో బోర్లించాలి. గుండ్రంగా వచ్చిన ఢోక్లాను కత్తితో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి గిన్నెలోకి తీసుకోవాలి.చిన్న మూకుడులో నూనె, పోపుగింజలు, తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లికాడల తరుగు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు పెట్టాలి. దీనిని ఢోక్లా మీద వేసి కలిపి, పచ్చికొబ్బరి తరుగు, కొత్తిమీర ఆకులతో అలంకరించి సర్వ్ చేయాలి.

Tips

  • ఢోక్లా గుల్లగా, మెత్తగా ఉన్నప్పుడే తినాలని అనిపిస్తుంది. అందుకోసం కప్పు సెనగపిండికి టేబుల్‌స్పూను బొంబాయిరవ్వ, పావుకప్పు పెరుగూ, మిగిలిన పదార్థాలతోపాటూ కొద్దిగా నిమ్మరసం వేసుకుని అన్నింటినీ కలపాలి.

  • మరీ పల్చగా, అలాగని గట్టిగా లేకుండా చూసుకోవాలి. ఇలా పిండిని ముందురోజే కలిపి కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు నాననివ్వాలి. అప్పుడే పిండి పులిసి, పొంగినట్లు గుల్లగా వస్తుంది. ఒకవేళ దీన్ని అప్పటికప్పుడు చేసుకుంటున్నట్లయితే అందులో చెంచా ఫ్రూట్‌సాల్ట్‌ వేయాలి. దాన్ని వేసినప్పుడు పదార్థాన్ని ఒకవైపు నుంచి మరోవైపు మాత్రమే కలపాలి.

  • దీన్ని కుక్కర్‌లో తయారు చేస్తుంటే.. అందులో ఒకటిన్నర నుంచి రెండు గ్లాసుల నీళ్లు పోయాలి. అవి బాగా మరిగాక అప్పుడు ఢోక్లా మిశ్రమం వేసిన గిన్నెను ఉంచి మూత పెట్టేయాలి. మంట మధ్యస్థంగా ఉంచి పదిహేను నిమిషాలు ఉడికిస్తే చాలు. అంతకు మించి ఉడికిస్తే గట్టిగా తయారవుతుంది.

  • మైక్రోవేవ్‌ ఓవెన్‌లో చేస్తున్నప్పుడు దానికి ఫ్రూట్‌సాల్ట్‌ కలిపిన పదినిమిషాల తరవాత అందులో ఉంచాలి. ఓవెన్‌లో రెండుమూడు నిమిషాల్లో తయారవుతుంది. ఆ తర్వాత ఓసారి చూసుకుని మరోసారి అందులో ఉంచి తీస్తే చాలు. ఈ రెండూ కాకపోతే వెడల్పాటి గిన్నెలో నీళ్లు పోసి.. అందులో ఢోక్లా మిశ్రమం ఉన్న గిన్నెను ఉంచి..పొయ్యిమీద పెట్టాలి.

  • ఇది స్పాంజిలా రావాలనుకుంటే పావుకప్పు నీటిలో కొద్దిగా చక్కెర వేసి పొయ్యిమీద పెట్టి మరిగాక దింపేయాలి. ఇప్పుడు ఓ బాణలిలో కొద్దిగా నూనె వేడిచేసి కొద్దిగా ఇంగువా, తాలింపు వేయించుకుని దాన్ని చక్కెర నీటిలో వేయాలి. దాన్ని ఢోక్లా ముక్కలన్నింటిపై వేస్తే.. మెత్తగా ఉండి, రుచీ బాగుంటుంది.

No comments:

Post a Comment